ఉండి: కాళ్లకూరు శ్రీవారి ఆదాయం రూ. 19. 36 లక్షలు
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయంభూ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించినట్లు కార్యనిర్వహణ అధికారి వెంకట కృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు 127 రోజులకు గాను వివిధ సేవల ద్వారా రూ19, 36, 321 ఆదాయం వచ్చినట్టు ఆయన వివరించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.