తణుకు డిపో నుంచి కార్తీకమాసం పురస్కరించుకుని పుణ్యక్షేత్రాలు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డీఎం గిరిధర్‌కుమార్ శనివారం తెలిపారు. పంచారామాలకు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయల్దేరి కార్తీక సోమవారం రోజుల్లో దర్శనాలు అనంతరం తణుకు చేరతాయన్నారు. పల్లె వెలుగు రూ. 700, అల్ట్రా డీలక్స్ రూ. 1000, సూపర్ లగ్జరీ రూ. 1100 చొప్పున ధరలు నిర్ణయించినట్లు చెప్పారు.