విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ కార్మికులు చేస్తున్న ఉద్యమం శనివారంతో 700 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ ఒకటి తారీఖున అనుబంధ కార్మిక సంఘాల కార్యకర్తలు ఆర్టీసీ డిపో సెంటర్‌లలో భారీ ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఆర్టిసి భవన నిర్మాణ కార్మికులు, అనుబంధం యూనియన్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటు కారణ ప్రతిపాదన విరమించాలని ప్రభుత్వ రంగంలోనే ఉక్కు కర్మాగారం కొనసాగించాలని కోరారు. ఐరన్ బోర్ బొగ్గు గనులను కేటాయించాలని వారు నినాదాలు చేశారు. ఉక్కు కార్మికుల పోరాటానికి వారు మద్దతు కొనసాగిస్తామని తెలిపారు.