ఏలూరు జిల్లాలో ఇసుక నిల్వలు తగ్గిపోతున్నాయి. కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట, వింజరం, చేబ్రోలులో రెండు నెలల కిందట 95 వేల టన్నుల ఇసుక నిల్వ ఉన్న ఇబ్రహీంపేట కేంద్రంలో ప్రస్తుతం 25 వేలు, వింజరంలో 1500 టన్నులు మాత్రమే ఉంది. నిల్వలు తగ్గిపోవడంతో మళ్లీ తవ్వకాలు చేయాల్సి ఉంది. అయితే గోదావరిలో ఇప్పటికీ వరద నిండుగా ప్రవహిస్తుండటంతో అక్టోబరు 15 తర్వాత తవ్వకాలు జరిపేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.