బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఎ వద్ద బుధవారం రామారావు పేట సెంటర్ గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు ఫ్రాన్సిస్ మాట్లాడుతూ జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే నిర్మాణంలో అధికారులు కొలతలు మార్పులు చేసి దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరారు.