స్త్రీ హింసా వ్యతిరేక దినం సందర్భంగా నరసాపురం రాయపేటలోని లెనిన్ హైస్కూల్ లో పట్టణ కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మహిళా సాధికారత కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షురాలు పుప్పాల ఉమామహేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, ప.గో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఆడమగ సమానమనే భావన బాల్యదశలోనే నాటుకోవాలని, అప్పుడే మహిళలపై వేధింపులు తగ్గుతాయన్నారు.