చిన్నారులు ఎనీమియా బారిన పడకుండా, అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నులిపురుగుల మందుల పంపిణీ కార్యక్రమాన్ని మండలంలోని తడికలపూడి మేజర్ పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నులి పురుగుల మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండి, భోజనానికి ముందు, తర్వాత చేతులను పరి శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. చేతివేళ్లకు గోర్లు పెంచుకోవద్దన్నారు. వేడి నీళ్లనే తాగుతూ తగు జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, నల్లమెల్లి సుమలత, జ్యోతి, ఆసుపత్రి సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.