యువ రైతు కరణ్ సింగ్ మృతికి కారణమైన కేంద్ర బిజెపి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక అర్హత లేదని రైతు సంఘం సీనియర్ నాయకులు ఉండవల్లి కృష్ణారావు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటంపై కేంద్ర బిజెపి ప్రభుత్వం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ధమనకాండ కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక దేవరపల్లి బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు.