ఏలూరుకి సీఎం రాక... విరాళాల వెల్లువ
ఏలూరు జిల్లాలో వరద నష్టాలను పరిశీలించడానికి బుధవారం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జిల్లాలోని ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధికి, రాజధాని నిర్మాణానికి విరాళాలు అందజేశారు. సర్. సి. ఆర్. రెడ్డి కళాశాల సంస్థల సిబ్బంది వరద సహాయక కార్యక్రమాలకు తమ ఒకరోజు వేతనం 20 లక్షలు, ఏలూరు క్లబ్ 10 లక్షలు, చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ 4 లక్షలు, కొవ్వలి గ్రామ మహిళ బృందం 5 లక్షలు విరాళం అందజేశారు.