కామవరపుకోట మండలం కొండగూడెం శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా టిప్పర్ల ద్వారా మట్టి రవాణా చేస్తున్నారనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎమ్మార్వోని గురువారం వివరణ కోరగా ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలియజేశారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.