చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నామవరం గ్రామంలో నాటుసారా స్థావరాలపై అధికారులు బుధవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎక్కువ మోతాదులో నమోదైనా పాత నాటుసారా, బెల్లపు ఊట ధ్వంసం కేసులో నిందితుడైన రామారావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని చింతలపూడి తహశీల్దార్ ప్రమద్వార ఎదుట బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సిఐ అశోక్ తెలిపారు.