ఇరగవరం మండలం ఐతంపూడి, ఏలేటిపాడు గ్రామాల్లో సీసీ రోడ్డు విస్తరణ పనులు పూర్తవ్వడంతో ఈ నెల 29 నుంచి రాకపోకలు పునరుద్ధరిస్తున్నట్లు ఆర్అండీబీ ఏఈ ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 25 నుంచి పెనుగొండ- పెరవలి ఆర్అండ్బీ రహదారిపై రాకపోకలు నిలుపుదల చేయడంతో వాహనాలు సిద్ధాంతం మీదుగా తిరిగాయని చెప్పారు. 29వ తేదీ నుంచి యథావిధిగా రాకపోకలు కొనసాగించవచ్చని వెల్లడించారు.