ఉంగుటూరు: తేమ శాతం పేరుతో ధాన్యం మద్దతు ధరలో కోత అన్యాయం
మద్దతు ధరకే ప్రతి గింజా కొంటాం అని ప్రభుత్వం చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతన లేదని. దళారులు తేమ శాతం పేరుతో మద్దతు ధరలో రూ. 325 లకు పైగా కోత పెట్టడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరు, చేబ్రోలు, నారాయణపురం, నాచుగుంట, వెల్లమెల్లి గ్రామాల్లో పర్యటించారు. తేమ శాతం పేరుతో ధాన్యం మద్దతు ధరలో కోత అన్యాయమన్నారు.