ప.గో: పాడు పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు
ఏలూరు జిల్లా నిడమర్రు మండల పరిధిలో జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ వీరప్రసాద్ హెచ్చరించారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని మందలపర్రు గ్రామంలో జూద స్థావరంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ₹. 7, 260 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.