మంతెన రామరాజును కలిసిన టిడిపి నేతలు
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల ఉండి మాజీ ఎమ్మెల్యే, మంతెన రామరాజు నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం రామరాజును ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి నేతలు పాల్గొన్నారు.