గోపాలపురం: సమస్యలపై 61 అర్జీలు అందజేత
గోపాలపురం మండలం చెరుకుమిల్లిలో రెవెన్యూ గ్రామసభ సోమవారం జరిగింది. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేతో సమస్యలు ఎదుర్కొన్న రైతులు అర్జీలు అందజేశారు. మొత్తంగా 61 మంది అర్జీలు ఇచ్చారు. వీటిని సకాలంలో పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. సర్పంచ్ ముళ్లపూడి వరలక్ష్మి, వీఆర్వో శ్రీనివాస్, రీసర్వే డీడీ సాంబశివరావు, మండల సర్వేయర్ తులసి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.