రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో శనివారం సాయంత్రం అభివృద్ధి పనులకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు సి. సి. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ప్లాంట్, స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సకాలంలో వీటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.