అచ్యుతాపురం జంక్షన్ నుంచి పూడిమడక వెళ్లే రహదారిలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని స్థానికులు రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయనను స్థానిక టీడీపీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్ఈజెడ్ కు చెందిన పరిశ్రమల వాహనాలను అచ్యుతాపురం బయట నుంచి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.