విశాఖ దక్షిణంలోని 31వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి సమస్య పరిష్కరిస్తానని, అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేస్తామన్నారు. ప్రజలు పలు సమస్యలను విన్నవించారు. లలితా కాలనీ పార్కులో పరిసర ప్రాంతాల్లో గంజాయి సమస్య అధికంగా ఉందని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.