పరవాడ: ప్రత్యేక దళాన్ని ఉపసంహరించుకోవాలి
కార్మిక పోరాటాలను అణిచివేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దళాన్ని (స్వాట్) ఉపసంహరించుకోవాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టీ సత్య నారాయణ డిమాండ్ చేశారు. గురువారం పరవాడలో ఆయన మాట్లాడుతూ ఇది నిరంకుశ చర్యలకు దారితీస్తుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో కార్మికులు ప్రజలు తమ సమస్యలపై నిరసన తెలియజేసే హక్కు ఉందని ఉగ్రవాదులను అణిచివేసే విధంగా కార్మిక పోరాటాలను అణిచివేయడం తగదన్నారు.