పెందుర్తి మండలం వేపగుంటలో గ్యాస్ లీకేజ్ కారణంగా జరిగిన ప్రమాదంలో గాయపడిన మీసాల పైడమ్మకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు రూ. పదివేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులను శనివారం అందజేశారు. ముందుగా ఆమె ఇంటికి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.