అచ్యుతాపురంలో అభిజిత్ పరిశ్రమ ప్రకటించిన అక్రమ లే ఆఫ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.