ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని ఆదివారం కలెక్టర్ దినేష్ కుమార్, ఆయన సతీమణి, అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ , వారి పిల్లలు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు కలెక్టర్ దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు తరలివచ్చారు.