స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను మొండిగా కొనసాగిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లుగా ఢిల్లీ పర్యటన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన ప్రకటించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి. రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. పౌర గ్రంథాలయంలో ప్రజా సంఘాల నాయకులతో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.