విధి నిర్వహణలో సచివాలయ ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని మాడుగుల పంచాయతీ కార్యనిర్వహణ అధికారి కే మూర్తి బాబు ఆదేశించారు. మంగళవారం మాడుగులలో గల సచివాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు, హాజరుపట్టిక మూమెంట్ రిజిస్టర్ పరిశీలించారు. సకాలంలో కార్యాలయం చేరుకుని హాజరు రిజిస్టర్ లో తప్పకుండా సంతకం చేయాలని తదుపరి విధి నిర్వహణలో ఎక్కడికి వెళ్ళినా మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు.