తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో నాయకులు కార్యకర్తలు చూపిస్తున్న చొరవ అమోఘమనీ ఇంకా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరీమణులు మరింత చొరవ చూపాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సభ్యత్వ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని మన రాష్ట్రంలోనే మాడుగుల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.