బుచ్చయ్యపేట మండలం దిబ్బిడిలో బ్లెస్సింగ్ చర్చిపాస్టర్ రాజేష్ ఆధ్వర్యంలో సిఎల్సి మినిస్ట్రీ అధినేత బిస్సాప్ సుధీర్ మహంతి సహకారంతో మంగళవారం నిర్వహించిన మెగా మెడికల్, నేత్ర వైద్య శిభిరం విజయవంతమైంది అమ్మ బ్లడ్ క్యాంపు ఆద్వర్యంలో రక్త దాన శిబిరం కూడా నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి సుమారు 200 మంది రోగులు హాజరై కంటి తనిఖీలు నిర్వహించుకున్నారు. ఎంపీపీ, డైరీ డైరెక్టర్ సత్యనారాయణ నిర్వాహకులను అభినందించారు.