బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారం గ్రామంలో సోమవారం సుంకర అప్పలనాయుడు ఇంట్లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో అర్పడానికి ప్రయత్నించిన అతని భార్య, చిన్నమ్మలు, అతని చిన్న కుమారుడు మహాలక్ష్మి నాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్థులు స్పందించి మంటలను అదుపు చేసి, వారిని బుచ్చయ్యపేట పిహెచ్సికి తరలించి, అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించినట్లు బుచ్చయ్యపేట వైద్యాధికారి డాక్టర్ కె వెంకట కృష్ణ తెలిపారు.