అచ్యుతాపురం: కార్మిక కర్షకుల సమస్యలు పరిష్కరించాలి
కార్మిక, కర్షకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. రాము తెలిపారు. ఆందోళనకు సంబంధించి శుక్రవారం అచ్యుతాపురం సంతలో కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వంలో కార్మిక, కర్షకులు పలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీఐటీయూ కన్వీనర్ సోమనాయుడు పాల్గొన్నారు.