ఏపీలో కీచక ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది. కాకినాడలోని జగన్నాథపురం నగర పాలక సంస్థ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థినులతో మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో శ్రీనివాస్ పారిపోయేందుకు యత్నించాడు. కీచక ఉపాధ్యాయుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.