కే. కోటపాడు: జగనన్న లేఔట్ పరిశీలించిన హౌసింగ్ పీడీ
కే. కోటపాడు మండలం కింతాడ పంచాయతీ జగనన్న లేఔట్ ని అనకాపల్లి జిల్లా హౌసింగ్ పీడీ (డిప్యూటీ కలెక్టర్) బుధవారం పరిశీలించారు. అసలు పూర్తిగా ఉన్న ఇళ్లను మార్చి 2025లోగా పూర్తి చేయాలని, దానికి పూర్తి సహకారం కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండారు నరసింహనాయుడు, హౌసింగ్ మండల ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్స్, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.