విశాఖ: ఏపీకి ప్రధాని మోడీ రాక..
ప్రధాని మోడీ ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఆయన రూ.80 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు 1200 ఎకరాల్లో విశాఖలో అమలవుతాయి. 48,000 మందికి ఉపాధి కలిగే అవకాశముందని సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.