విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం పరిధిలోని చంద్ర నగర్ లో నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్ కు బీహార్ కు చెందిన యువకుడు శంభు సదా (35) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.