కంచరపాలెంలో అగ్నిప్రమాదం

52பார்த்தது
విశాఖలో 48వ వార్డు ఏఎస్ఆర్ నగర్ లోని ఓ ఇంట్లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. 281 సచివాలయ పరిధిలో వెంకటలక్ష్మి అనే మహిళ దేవుడు వద్ద దీపం పెట్టి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళింది. ఆతర్వాత ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే చాలా వరకు ఇల్లు దగ్దమైపోయింది. వార్డు కార్పొరేటర్ కవిత ఘటనా స్థలికి చేరుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி