పాడేరు మండలం, జి.మాడుగుల మండలం సరిహద్దు గ్రామాలు చింతగున్నలు, మతికిబంద, మండ్డిగరువులో ఆరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి శతక బుల్లిబాబు, పాడేరు మండల అధ్యక్షుడు కూడా సింహాచలం సందర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యలపై చర్యలు తీసుకుంటామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నాయకులు మాజీ సర్పంచ్ పాంగి.నాగరాజు, మాజీ సర్పంచ్ బస్వానదొర, సీనియర్ నాయకుడు కృష్ణ, పాంగీ.రమేష్, విద్యా కమిటీ అధ్యక్షుడు గెమ్మేలి.నూకరాజు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.