నర్సీపట్నం.. గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం పంపిణీ
నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం పంపిణీ కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శనివారం నిర్వహించారు. స్వామి 99వ జన్మదినం సందర్భంగా సుమారు120 మంది గర్భిణీ స్త్రీలకు సత్యసాయి ప్రేమమృతం పౌష్టికాహారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి హాజరై గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. సంస్థ సేవలను ఆమె ప్రశంసించారు