విశాఖ పోర్టు హాస్పిటల్ ప్రయివేటీకరణ ఆపాలని, సొంత నిధులతో అభివృద్ధి చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పోర్టు హాస్పిటల్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఆసుపత్రి వద్ద చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఎఐటియుసి నాయకులు మసేన్, హెచ్ఎంఎస్ నాయకులు మంగ నాయుడు, సిఐటియు నాయకులు కె. సత్యనారాయణ, జె. సత్యనారాయణ, ప్రారంభించారు.