రేసపువానిపాలెం: 24న రన్ ఫర్ అంబేద్కర్
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న విశాఖ బీచ్ రోడ్డు లో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం. రవి సిద్ధార్థ తెలిపారు. నగరంలో అంబేద్కర్ భవన్లో శుక్రవారం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నట్లు తెలిపారు. అలాగే 26న రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.