ఎస్ కోట మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్సై భాస్కర్ రావు ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తెలిపారు. సైబర్ నేరాలు పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కోరారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని భవిష్యత్తుకు ఉత్తమ బాటలు వేసుకోవాలని కోరారు.