వేపాడ మండల కేంద్రంలో గురువారం శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఆప్తాలమిస్ట్ దుర్గ భవాని 45 మంది రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 22 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. వీరికి శంకర్ ఫౌండేషన్ లో ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందని క్యాంపు కోఆర్డినేటర్ ఎస్ జోగారావు తెలిపారు.