సాలూరు: అయిదేళ్ళలో అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు: మంత్రి
సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలో మంగళవారం పల్లె పండగ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఆండ్ర రోడ్డు నుంచి పిట్టాడ గ్రామ దేవత పైడితల్లి అమ్మవారి అలయానికి రోడ్డు రూ. 15 లక్షలు, గుర్ల తమ్మిరాజుపేటలో సచివాలయం పక్కన రోడ్డు రూ. 15లక్షలతో పనులకు శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రం భవనాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు.