సాలూరు పట్టణంలోని ఆటోనగర్ సబ్జెస్టేషన్ పరిధిలో 11కెవి పాలిటెక్నిక్ ఫీడరు, సాలూరు సబ్స్టేషన్ పరిధిలో ఉన్న 11కెవి బాగువలస ఫీడరు, సాలూరు టౌన్ ఫీడర్ మరమ్మతులు, చెట్టుకొమ్మలు తొలగించే పనులు చేపడతామని విద్యుత్ శాఖ ఈఈ గోపాలరావు నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటలు వరకు ఆయా ఫీడర్ల పరిధిలో పవర్ కట్ ఉంటుందన్నారు.