పార్వతీపురం ఎల్ఐసి ఆఫీసు వద్ద ఏజెంట్ల నిరసన
పార్వతీపురంలోని ఎల్ఐసి ఆఫీస్ వద్ద శుక్రవారం లియాఫీ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఎల్ఐసి ఏజెంట్లు నిరసన చేపట్టారు. పాత ఎల్ఐసి పాలసీల పద్ధతిని కొనసాగించాలి, కొత్తవాటిని రద్దు చేయాలి, జీఎస్టీ ని రద్దు చేయాలి, పాలసీ హోల్డర్స్ బోనస్ రేట్లు పెంచాలి, ఏజెంట్ల కమిషన్ పెంచాలి అని నినాదాలు చేశారు. ఏజెంట్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈనెల 28న ఎల్ఐసి ఆఫీస్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.