పాలకొండ పట్టణంలో ఉన్న జగనన్న కాలనీ ను సీపీఐ పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు మౌలిక సదుపాయాలపై అసహనం వ్యక్తం చేశారు. పేదలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 18న పాలకొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.