విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో డెంకాడ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విజయనగరం రూరల్ ఏపీఈపీడీసీఎల్ ఈఈ జి. సురేషబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముంగినాపల్లి, డి. కొల్లాం, కె. కొల్లాం, గుణుపూరుపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.