సచివాలయ సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని నెల్లిమర్ల ఎంపీడీవో రామకృష్ణంరాజు కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మండలంలో గల పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత మంచినీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో సరఫరా అయ్యే తాగునీటిలో తగిన మోతాదులో క్లోరినేషన్ చేపట్టాలని తెలిపారు.