ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కోరారు. సోమవారం భోగాపురం మండల కేంద్రంలో గల ఆర్. ఎస్. కె వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఆర్ ఎస్ కె ల ద్వారా ప్రభుత్వం సేకరించి 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఏవో హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.