డెంకాడ మండలం చొల్లంగిపేటలో సోమవారం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేసి లబ్ధి పొందాలని కోరారు. అధికారులు రైతుల నుండి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సకాలంలో సేకరించి రైతులకు పారదర్శకంగా సహకరించాలని కోరారు. రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.