రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కూరంగి సీతారాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని డంగభద్రలో రైతులు పండించిన ధాన్యాన్ని పరిశీలించారు. అధికారుల అండదండలతో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యంపై ఒక్కో బస్తాకు సుమారు రూ. 500 వరకు నష్టం కలిగిస్తున్నారని తెలిపారు.