ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో..?

59பார்த்தது
బొండపల్లి మండలం ఎం. కొత్తవలస నుండి మరువాడ గ్రామం వరకు రోడ్డు చాలా అద్వానంగా ఉంది. చిన్నపాటి వర్షం పడితే ఈ రోడ్డు గుంతల మయం కావడంతో చెరువును తలపిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది పాలకులు వచ్చినా ఎన్నిసార్లు చెప్పినా ఈ రోడ్డు పట్టించుకునే నాధుడు లేకపోయాడు. కూటమి ప్రభుత్వం అయినా రోడ్డు నిర్మిస్తుందని గ్రామస్తులు ఆశిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி